రేషన్‌ సరుకుల పంపిణీలో అవకతవకలు

ABN , First Publish Date - 2020-04-28T10:08:03+05:30 IST

నగరంలోని పలు ప్రాంతాల్లో రేషన్‌ సరకుల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీపీఎం,

రేషన్‌ సరుకుల పంపిణీలో అవకతవకలు

సీపీఎం, డీవైఎ్‌ఫఐ ఆధ్వర్యంలో ఇంటింట సర్వే


నెల్లూరు(వైద్యం), ఏప్రిల్‌ 27: నగరంలోని పలు ప్రాంతాల్లో రేషన్‌ సరకుల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీపీఎం, డీవైఎ్‌ఫఐ నేతలు సోమవారం మాలకొండారెడ్డి నగర్‌లో ఇంటింట సర్వే నిర్వహించారు. మాజీ డిప్యూటీ మేయర్‌ మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొన్నిచోట్ల బియ్యం మాత్రమే అందచేశారని, కందిపప్పు, శనగలు ఇవ్వలేదన్నారు. రేషన్‌ కార్డులేని వారు సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకుని సరకులు తీసుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పినా అది క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోలేదన్నారు. సీపీఎం నేతలు బత్తల కృష్ణయ్య, గౌస్‌పీర్‌, దిలీప్‌, రాజా, డీవైఎ్‌ఫఐ నేతలు సన్నీ, రోషన్‌, ప్రేమ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-28T10:08:03+05:30 IST