చెరువులను తలపిస్తున్న పంటపొలాలు

ABN , First Publish Date - 2020-12-08T01:17:47+05:30 IST

మండలంలో సోమవారం మధ్యాహ్నం నుంచి జోరు వర్షం పడింది. దీంతో మళ్లీ చెరువులు, కాలువలు నిండి మరింత ఉధృతంగా పారుతున్నాయి. మనుబోలు, గురివిందపూడి చెరువు కలుజుల గుండా నీరంతా కిందకు పారుతోంది. వాగులు కట్ట

చెరువులను తలపిస్తున్న పంటపొలాలు
మనుబోలు పంటపొలాలను ముంచెత్తిన వర్షపునీరు

మనుబోలు, డిసెంబరు 7: మండలంలో సోమవారం మధ్యాహ్నం నుంచి జోరు వర్షం పడింది. దీంతో మళ్లీ చెరువులు, కాలువలు నిండి మరింత ఉధృతంగా పారుతున్నాయి. మనుబోలు, గురివిందపూడి చెరువు కలుజుల గుండా నీరంతా కిందకు పారుతోంది. వాగులు కట్టలకు మించి పారుతుండడంతో పక్కనే ఉన్న పంటపొలాలపైకి నీరు చేరింది. జాతీయ రహదారి గుంతలు పడి చిధ్రంగా మారుతోంది. బద్దెవోలులోని రామలింగేశ్వరాలయం వారం రోజులుగా నీటిలో నానుతోంది. అటు దేవదాయశాఖ అధికారులుగాని, ఇటు గ్రామస్థులుగాని ఆలయంలో నీటిని తరలించే ఏర్పాట్లు చేయలేదు.



Updated Date - 2020-12-08T01:17:47+05:30 IST