కరకట్టల ధ్వంసంతో రిజర్వాయర్‌కు ముప్పు
ABN , First Publish Date - 2020-12-02T04:04:59+05:30 IST
నిండుకుండను తలపిస్తున్న కనిగిరి రిజర్వాయర్ కరకట్టలను కొంతమంది అక్రమార్కులు రెండురోజుల క్రితం ధ్వంసం చేశారు.

గ్రావెల్ తవ్వుతున్న అక్రమార్కులు
పట్టించుకోని అధికారులు
బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు1: నిండుకుండను తలపిస్తున్న కనిగిరి రిజర్వాయర్ కరకట్టలను కొంతమంది అక్రమార్కులు రెండురోజుల క్రితం ధ్వంసం చేశారు. దీంతో వవ్వేరు గ్రామస్థులతోపాటు రిజర్వాయర్ దిగువ గ్రామాలవారు, మండలంలోని రైతులు, రిజర్వాయర్‌కు ముప్పు తఽథ్యమంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కరకట్టలు పూర్తిగా నానిపోయాయి.దీంతో కట్టల్లోనుంచి రిజర్వాయర్‌లో నీళ్లు కింది పొలాల్లోకి పారుతున్నాయి. ఈ క్రమంలో పొలాల చదును కోసం కొందరు, గ్రావెల్ అక్రమ తవ్వకాలతో మరి కొందరు కనిగిరి కరకట్టలను ఽధ్వంసం చేస్తున్నారు. సంబంఽధిత శాఖల అఽధికారులకు రైతులు ఫిర్యాదు చేసినప్పుడు విచారించడం, నామమాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు రిజర్వాయర్‌ను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. కరకట్టల తవ్వకాల విషయమై వీఆర్వో అనంతమహాలక్ష్మిని వివరణ కోరగా సమాచారం తెలుసుకుని వెళ్లేవరకు యంత్రాలు, అక్రమార్కులు ఎవరూ లేరని పేర్కొన్నారు. తహసీల్దారు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు..
కనిగిరి రిజర్వాయర్ కరకట్టలు అక్రమార్కుల ధాటికి బలహీనపడ్డాయి.ఈ విషయమై తహసీల్దారు, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు.
-ఇనమడుగు రమణారెడ్డి, రైతు, వవ్వేరు
----------