కారు ఢీ కొని ఒకరికి గాయాలు

ABN , First Publish Date - 2020-12-21T05:09:19+05:30 IST

కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.

కారు ఢీ కొని  ఒకరికి గాయాలు

తడ, డిసెంబరు 20 : కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కారూరు గ్రామానికి చెందిన కె. మునికృష్ణ ఆదివారం రాత్రి పనిపై కారూరుమిట్ట గ్రామానికెళ్లి తిరిగి నడిచి వస్తున్నాడు. భీములవారిపాళెం చెక్‌పోస్టు రవాణాశాఖ కార్యాలయం జాతీయ రహదారి వద్ద రోడ్డు దాటుతుండగా చెన్నై నుంచి తడకు వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మునికృష్ణకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని స్థానికులు  సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-12-21T05:09:19+05:30 IST