కొవ్వొత్తులతో రైతు సంఘాల నిరసన ప్రదర్శన
ABN , First Publish Date - 2020-12-16T05:21:32+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల నాయకులు మంగళవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
నెల్లూరు (వైద్యం), డిసెంబరు 15 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల నాయకులు మంగళవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి శ్రీరాములు, రైతు సంఘాల ఐక్యవేదిక నేతలు రమణయ్య నాయుడు, వెంకటేశ్వర్లు, కలికాల వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.