దౌర్జన్యం చేసి భూములు ఆక్రమణ

ABN , First Publish Date - 2020-12-16T03:47:50+05:30 IST

మాపై దౌర్జన్యం చేసి, కులం పేరుతో దూషించి మా భూములను ఆక్రమించుకుని అడ్డు వచ్చిన వారిని చంపుతానని బెదిరిస్తున్నారని బోగోలు మండలం చెన్నారాయునిపాలెంకు చెందిన గిరిజన మహిళలు కావలి ఆర్డీవో జీ.శ్రీనివాసులు వద్ద మొరపెట్టుకున్నారు.

దౌర్జన్యం చేసి భూములు ఆక్రమణ
ఆర్డీవోకు వినతిపత్రం ఇస్తున్న గిరిజనులు

ఆర్డీవో శ్రీనివాసులుకు గిరిజనుల మొర


కావలి, డిసెంబరు 15: మాపై దౌర్జన్యం చేసి, కులం పేరుతో దూషించి మా భూములను ఆక్రమించుకుని అడ్డు వచ్చిన వారిని చంపుతానని బెదిరిస్తున్నారని బోగోలు మండలం చెన్నారాయునిపాలెంకు చెందిన గిరిజన మహిళలు కావలి ఆర్డీవో జీ.శ్రీనివాసులు వద్ద మొరపెట్టుకున్నారు. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌.మల్లి ఆధ్వర్యంలో గిరిజన మహిళలు మంగళవారం కావలి ఆర్డీవోను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఒక్కొక్కరికి 52 సెంట్ల భూమిని ఇచ్చిందన్నారు. చెన్నాయపాలెం గ్రామానికి చెందిన రాజకీయ పలుకుబడి కలిగిన భూస్వాములు కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి తన అనుచరులు ద్వారా తమను బెదిరించి భూములను లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ విషయం బోగోలు తహసీల్దారు, ఆర్‌ఐ, వీఆర్వో దృష్టికి తీసుకెళ్లినా మాకు న్యాయం చేయటం లేదన్నారు. తమపై దౌర్జన్యం చేసి కులం పేరుతో దూషించిన వారిపై బిట్రగుంట పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. తమ భూములు తమకు ఇప్పించి, దౌర్జన్యం చేసిన వారిపై శిక్షించి న్యాయం చేయాలని కోరారు.   స్పందించిన ఆర్డీవో విచారించి  న్యాయం జరిగేట్లు చూస్తానని చెప్పారు.

Updated Date - 2020-12-16T03:47:50+05:30 IST