బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా కృష్ణచైతన్య

ABN , First Publish Date - 2020-12-28T05:03:42+05:30 IST

బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా నెల్లూరు రూరల్‌ ప్రాంతం సిరిగార్డెన్‌కు చెందిన సూరపనేని కృష్ణచైతన్యను ఎంపిక చేశారు.

బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా కృష్ణచైతన్య
కృష్ణచైతన్య

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), డిసెంబరు 27:  బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా నెల్లూరు రూరల్‌ ప్రాంతం సిరిగార్డెన్‌కు చెందిన సూరపనేని కృష్ణచైతన్యను ఎంపిక చేశారు. ఈ పదవి రావడం ఎంతో ఆనందంగా ఉందని కృష్ణచైతన్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  ఇందుకు సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్‌కు, నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు భరత్‌కుమార్‌ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  

Updated Date - 2020-12-28T05:03:42+05:30 IST