-
-
Home » Andhra Pradesh » Nellore » bjym leader ketineni surendra mohan nellore
-
తిరుపతిలో బీజేపీ, జనసేన కలిసి పోటీ: సురేంద్ర
ABN , First Publish Date - 2020-12-10T19:34:14+05:30 IST
బీజేపీ- జనసేన కలిసి తిరుపతి పార్లమెంట్‌లో పోటీ చెయ్యబోతున్నామని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్ర మోహన్ తెలిపారు.

నెల్లూరు: బీజేపీ- జనసేన కలిసి తిరుపతి పార్లమెంట్‌లో పోటీ చెయ్యబోతున్నామని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్ర మోహన్ తెలిపారు. గ్రామగ్రామాన తిరిగి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తామని చెప్పారు. జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని విమర్శించారు. పార్లమెంట్‌లో ఒక మాట.. ప్రజల్లో మరో మాట చెబుతూ వైసీపీ నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. సర్వశిక్షా అభియాన్‌కి వచ్చే నిధులతోనే జగన్న విద్యా కానుక ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు తిరుపతి ఎన్నికలో బీజేపీ గెలుపే నాంది అని సురేంద్ర స్పష్టం చేశారు.