జగన్నాటకాలను సాగనివ్వం

ABN , First Publish Date - 2020-12-11T05:21:10+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జగన్నాటకాలను సాగనివ్వమని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్‌ పేర్కొన్నారు.

జగన్నాటకాలను సాగనివ్వం
మాట్లాడుతున్న సురేంద్ర మోహన్‌

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్‌


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), డిసెంబరు 10: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జగన్నాటకాలను సాగనివ్వమని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రమోహన్‌ పేర్కొన్నారు. నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయ బిల్లు, ఈడబ్ల్యూఎస్‌ బిల్లులకు పార్లమెంట్‌లో మద్దతు పలికి రాష్ట్రంలో వ్యతిరేకించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నారన్నారు. రాబోయే తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, జనసేన అభ్యర్థి విజయం సాఽధించడం తథ్యమని జోస్యం చెప్పారు. గ్రామగ్రామాన వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారం చేస్తామన్నారు. బీజేపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ దేశంలో రైతు రాజ్యం రావాలని ప్రధాని కొత్త వ్యవసాయ చట్టం తెస్తే అసత్య ఆరోపణలతో కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు పొలిచర్ల ఉదయ్‌కుమార్‌, గుత్తా అశోక్‌నాయుడు, ముక్కు రాధాకృష్ణ గౌడ్‌, సూరపునేని కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-11T05:21:10+05:30 IST