బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు రాక

ABN , First Publish Date - 2020-12-29T04:40:55+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం సూళ్లూరుపేటకు వస్తున్నట్టు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు  రాక

సూళ్లూరుపేట, డిసెంబరు 28 :  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం సూళ్లూరుపేటకు వస్తున్నట్టు ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తెలిపారు.  సోమవారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి భవనంలో వీర్రాజు రాక ఏర్పాట్లపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలకు  పార్టీని సన్నద్ధం చేసే భాగంలో వీర్రాజు ఇక్కడకు  వస్తున్నట్టు తెలిపారు. స్థానిక ఎంకేఎం కల్యాణ మండపంలో కార్యకర్తల సమావేశానికి హాజరవుతున్నట్టు తెలిపారు.

Updated Date - 2020-12-29T04:40:55+05:30 IST