బీజేపీని బలోపేతం చేయండి

ABN , First Publish Date - 2020-12-07T02:57:58+05:30 IST

వచ్చే తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి సునీల్‌ ధియోధర్‌ పిలుపునిచ్చారు.

బీజేపీని బలోపేతం చేయండి

బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి సునీల్‌ దియోధర్‌

వెంకటగిరి(టౌన్‌), డిసెంబరు 6:వచ్చే తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి సునీల్‌ ధియోధర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పింజల వీరయ్య కల్యాణ మండలంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11న తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 47మండలాల్లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉప ఎన్నికల్లో గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాల న్నారు. ఇందుకోసం ప్రతి మండలానికి ఒక  రాష్ట్ర నాయకుడు అధ్యక్షుడుగా వ్యవహరిస్తారని తెలిపా రు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దయాకర్‌ రెడ్డి,  ఉమా, రంగినేని కృష్ణమనాయుడు, ఎస్‌ఎస్‌ఆర్‌ నాయుడు, అల్లం చంద్రమోహన్‌, శ్రావణ్‌, భాస్కర్‌, శివకోటి, బాలకృష్ణయ్య, సుధాకర్‌ రాజు, వెంకటరమణయ్య, పెంచలయ్య, డి. పెంచలయ్య, చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more