మౌలిక వసతులు పునరుద్ధరించండి

ABN , First Publish Date - 2020-12-02T04:05:46+05:30 IST

నివర్‌ తాకిడికి పలు చోట్ల మౌలిక వసతులు ఽధ్వంసమయ్యాయని వాటిని యుద్ధప్రాతికదిన పునరుద్ధరించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కే బ్రహ్మానందం ఆధ్వర్యంలో నాయకులు మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డిని కోరారు.

మౌలిక వసతులు పునరుద్ధరించండి
మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డికి వినతి పత్రం అందిస్తున్న బీజేపీ నేతలు

మున్సిపల్‌ కమిషనర్‌కి బీజేపీ వినతి 

కావలిటౌన్‌, డిసెంబరు 1: నివర్‌ తాకిడికి పలు చోట్ల మౌలిక వసతులు ఽధ్వంసమయ్యాయని వాటిని యుద్ధప్రాతికదిన పునరుద్ధరించాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కే బ్రహ్మానందం ఆధ్వర్యంలో నాయకులు మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డిని కోరారు. మంగళవారం 40 వార్డులలో పర్యటించిన వారు అక్కడి పరిస్థితులను గుర్తించి కమిషనర్‌ దృష్టికి తెచ్చారు. పేదల కాలనీల్లో వెంటనే వరద నీటిని తొలగించి విద్యుత్‌ పునరుద్ధరించాలని, కూలిపోయిన పూరిగుడిసెల స్థానంలో పక్కాగృహాలు మంజూరు చేయాలని కోరారు. తాగునీటి వసతి, ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఏ కమల, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాషిణి, కే బాలమురళి, పరుసు వెంకటేశ్వర్లు, విజయ్‌కుమార్‌, అనిత, ఖాదర్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T04:05:46+05:30 IST