ఉత్సవాలు ఎందుకు జరుపుకోవాలి?: బీజేపీ నేత

ABN , First Publish Date - 2020-11-06T20:09:26+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులు రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఉత్సవాలు ఎందుకు జరుపుకోవాలి?: బీజేపీ నేత

నెల్లూరు: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులు రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల్లో నాడు.. ప్రజలతో నేడు కాకుండా పదవి కోసం నాడు.. పదవి కోసం నేడు అని మార్చాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఎందుకు ఉత్సవాల జరుపుకోవాలని పిలుపునిచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఈ ప్రభుత్వ ఇసుక విధానంతో నిర్మాణ రంగం, కార్మిక లోకం కష్టాల్లో ఉన్నందుకు ఉత్సవాలు జరుపుకోవాలా?.. మూడు రాజధానుల పేరుతో రాజధాని లేని రాష్ట్రాన్ని నిర్మించినందుకు ఉత్సవాలు జరుపుకోవాలా.? దళితుల మీద దాడులు, ఇళ్ల స్థలాల పేరుతో కుంభకోణం, రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులు, పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లు ఇవ్వనందుకు ఉత్సవాలు జరుపుకోవాలా?... పోలవరం విషయంలో గందరగోళం సృష్టించినందుకు ఉత్సవాలు జరుపుకోవాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అంటూ ఆంజనేయులు రెడ్డి ప్రశ్నలు సంధించారు.

Updated Date - 2020-11-06T20:09:26+05:30 IST