అధ్వాన రోడ్లకు మరమ్మతులు చేయండి

ABN , First Publish Date - 2020-12-06T02:56:51+05:30 IST

అధ్వానంగా మారి ప్రయణానికి ఇబ్బంది కలిగిస్తున్న రాష్ట్ర రహదారులకు తక్షణం మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ఆత్మకూరు పట్టణం సోమశిల రోడ్‌ సెంటర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.

అధ్వాన రోడ్లకు మరమ్మతులు చేయండి
ఆత్మకూరులో ధర్నా చేస్తున్న బీజేపీ నేతలు

బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా

ఆత్మకూరు, డిసెంబరు 5: అధ్వానంగా మారి ప్రయణానికి ఇబ్బంది కలిగిస్తున్న రాష్ట్ర రహదారులకు తక్షణం మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ శనివారం ఆత్మకూరు పట్టణం సోమశిల రోడ్‌ సెంటర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరటంపాటి సుధాకర్‌ మాట్లాడుతూ ఆత్మకూరుకు వచ్చే ప్రధాన రహదారులు గుంతలమయమై అధ్వానంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పలువులు బీజేపీ, అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు.

కొండాపురం : వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని బీజేపీ  మండల అధ్యక్షుడు మాలేపాటి మల్లికార్జున అన్నారు. సత్యవోలు అగ్రహారం- సత్యవోలు గ్రామాల మధ్య దెబ్బతిన రోడ్డును ఆయన పరిశీలించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు వింతా గోపాల్‌రెడ్డి, జీ.మధు, సింగయ్య తదితరులున్నారు.

అల్లూరు : మండలంలో అధ్వానంగా ఉన్న రోడ్ల మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అల్లూరులో ధర్నా  చేశారు. నార్తుమోపూరు నుంచి పురిణి పంచాయతీకి వెళ్లే రోడ్డు ఽధ్వంసం కావడంతో దానిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కన్యాపురి శ్రీనివాసులు, రాష్ట్ర ఎస్సీ మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్లు సాల్మన్‌రాజు, తదితరులు పాల్గొన్నారు. 

కావలిటౌన్‌ : పట్టణంలో పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు బాగు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కూడలిలో ధర్నా చేసి అనంతరం విష్ణాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కే బ్రహ్మానందం మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కార్యదర్శి ఏ కమల మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం సంక్షేమం పేరుతో ప్రజలను రాబంధుల్లా దోచుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వాయుగండ్ల సుధీర్‌, దామోదర్‌ నాయుడు, కే.మురళి, మాఽధవి, బీ. వేణు, ఏడుకొండలు, సోమశేఖర్‌, విజయ్‌కుమార్‌, ఖాదర్‌బాషా, తదితరులు పాల్గొన్నారు. 

బిట్రగుంట : గ్రామీణాభివృద్ధితో పాటు ప్రజలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స నిధులు పక్కదారి పట్టకుండా రోడ్ల మరమ్మతులు చేయించాలని బీజేపీ మండల కన్వీనర్‌ పసుపులేటి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. బోగోలు బజారులో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేసి, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు గుర్రం వెంకటేశ్వర్లు, మండల మహిళ అధ్యక్షురాలు నూకసాని రాజ్యలక్ష్మి,  రాజకుమారి, ఇజ్రాయేలు, సుబ్రహ్మణ్యం, వెంకటరమణయ్య, జంపాని ప్రసాద్‌, చప్పిడి .రవి తదితరులు పాల్గొన్నారు.

జలదంకి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి రోడ్ల అబివృద్ధి, మరమ్మతులు గాలికొదిలేశారని మండల బీజేపీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు మేరకు జలదంకి కావలి-ఉదయగిరి రోడ్డుపై గోతుల వద్ద బీజేపీ నాయకులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మారెళ్ల బ్రహ్మారెడ్డి, రాష్ట్ర నాయకులు బండారు తిరుపతిరెడ్డి, చల్లా హనుమారెడ్డి, వడ్డే శ్రీనాథ్‌రెడ్డి, కుట్టుబోయిన మాధవరావుయాదవ్‌, మండల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T02:56:51+05:30 IST