రైతులను ప్రభుత్వం అదుకోవాలి : బీజేపీ

ABN , First Publish Date - 2020-12-02T03:59:49+05:30 IST

నివర్‌ తుఫాన్‌ కారణంగా నష్టపోయిన ఆక్వా, వ్యవసాయ రైతులను ప్రభుత్వం అదుకోవాలని బీజేపీ నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు భరత్‌కుమర్‌ కోరారు. ఊటుకూరులోని ముంపు ప్రాంతాల్లో మంగళవారం అయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లా

రైతులను ప్రభుత్వం అదుకోవాలి : బీజేపీ
వరదలకు దెబ్బతిన్న పొర్లు కట్టలను పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు

విడవలూరు, డిసెంబరు 1: నివర్‌ తుఫాన్‌ కారణంగా నష్టపోయిన ఆక్వా, వ్యవసాయ రైతులను ప్రభుత్వం అదుకోవాలని బీజేపీ  నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు భరత్‌కుమర్‌  కోరారు.  ఊటుకూరులోని ముంపు ప్రాంతాల్లో మంగళవారం అయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నివర్‌ తుఫాన్‌ కారణంగా పెన్నానది పొర్లుకట్టలు తెగి, తీర ప్రాంత గ్రామాలు నీట మునిగాయన్నారు. అనేక ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. లక్షలాధి ఎకరాల్లోని నారుమళ్లు దెబ్బతిన్నాయన్నారు. అంతేకాకుండా పనరవాస కేంద్రాల్లో ఉన్న వారికి సక్రమంగా భోజనం కూడా పెట్టలేదన్నారు. తుఫాను కారణంగా దెబ్డతిన్న ఇళ్లకి, పంటలకు, ఆక్వారైతులకు నష్టపరిహారం చెల్లించాలని అయన డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు కనుపర్తి నాగేంద్ర, నిరంజన్‌, పీవీ రమణ, మొలతాటి విజయ, చలపతి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


 ఇందుకూరుపేటలో..

ఇందుకూరుపేట, డిసెంబరు 1 : జిల్లాలో తుఫాన్‌కు దెబ్బతిన్న రైతులను తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ  నెల్లూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు భరత్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన పార్టీ ప్రతినిధులతో కలిసి దెబ్బతిన్న పొలాలు, కయ్యలను పరిశీలించారు. రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తక్షణం నష్టాల వివరాలు సేకరించాలని, రాజకీయాలు సంబంధం లేకుండా అధికారులు రైతులకు న్యాయం చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘ నాయకులు మారుబోయిన శ్రీనివాసులు, చిరమన జనార్థన్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T03:59:49+05:30 IST