చికిత్సలకు సిద్ధంగా ఉండండి

ABN , First Publish Date - 2020-07-22T10:52:04+05:30 IST

కరోనా బాధితులకు వైద్య చికిత్సలు అందించేందుకు ప్రైవేట్‌ ఆసుbపత్రులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు

చికిత్సలకు సిద్ధంగా ఉండండి

వచ్చే రెండు నెలల్లో కేసులు పెరిగే అవకాశం

ప్రైవేట్‌ ఆసుపత్రులకు కలెక్టర్‌ పిలుపు


నెల్లూరు(వైద్యం)జూలై 21 : కరోనా బాధితులకు వైద్య చికిత్సలు అందించేందుకు ప్రైవేట్‌ ఆసుbపత్రులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు జడ్పీ ఎమర్జెన్సీ సెంటర్‌లో ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే రెండు నెలల్లో కరోనా కేసులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. దీనికి అనుగుణంగా వైద్య సేవలు అందించేందుకు ప్రైవేట్‌ ఆసుపత్రులు సహకరించాన్నారు. ప్రైవేట్‌ సుపత్రులలో కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఐసీయూ పడకలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతిరోజూ 4వేల కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నామని, దీని వల్ల కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.


ప్రైవేట్‌ ఆసుపత్రులలో చేసే కరోనా పరీక్షల వివరాలు నివేదిక రూపంలో అందించాలన్నారు. 45 ఏళ్ల లోపు వారికి కరోనా వస్తే వారిని హోంక్వారంటైన్‌లో ఉంచేలా చూడాలని తెలిపారు. శ్వాస, హృదయ సంబంధ సమస్యలు ఉండి కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే కొవిడ్‌ ఆసుపత్రికి తరలించాలన్నారు.  సమావేశంలో ఐఎంఏ రాష్ట్ర నేత డాక్టర్‌ అశోక్‌, ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-22T10:52:04+05:30 IST