రాకపోకల బంద్‌

ABN , First Publish Date - 2020-11-28T04:45:10+05:30 IST

నివర్‌ తుఫాన్‌తో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలతో మండలంలోని వెంకటరెడ్డిపాళె-కొండవల్లిపాడు, మానమాల- ఆచార్లపార్లపల్లి, నెమళ్లపూడి-కరబల్లవోలు గ్రామాల వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

రాకపోకల బంద్‌

ఓజిలి, నవంబరు 27 : నివర్‌ తుఫాన్‌తో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలతో మండలంలోని వెంకటరెడ్డిపాళె-కొండవల్లిపాడు, మానమాల- ఆచార్లపార్లపల్లి, నెమళ్లపూడి-కరబల్లవోలు గ్రామాల వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలో అన్ని చెరువులు నిండుకుండలా తొణికసలాడుతున్నాయి. అన్ని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నీటికుంటలు దొరువులు కూడా నీటిలో మునిగిపోయాయి.మండలంలోని ఆరిమేనిపాడు, చిల్లమానుచేను, కుందాం, తిరుమలపూడి, పెద్దపరియ, పెద్దపరిరాజుపాళెం తదితర గ్రామాల్లో కాపుమీద ఉన్న నిమ్మచెట్లు వాలిపోయాయి. సాగులో ఉన్న ఎల్దిపైర్లు నీటిలో ముగినిపోయిన ఉన్నాయి. పల్రుగామాల చుట్టూ వర్షపు నీరు చుట్టుకుఉంది. దీంతో ఆయా గ్రామాల్లో జనజీవనం స్తంభించింది. 

గ్రద్దగుంట ఎస్టీ కాలనీవాసులకు పునరావాసం

గ్రద్దగుంట ఎస్టీ కాలనీ వాసులను అధికారులు పునరావాస కేంద్రంలో ఉంచారు.  పాఠశాల భవనంలో వారికి భోజన, వసతులను ఏర్పాటుచేశారు. మండల ప్రత్యేకాధికారి ఉమాదేవి, తహసీల్దారు అనూరాధ, ఎంపీడీవో రమణయ్యలు ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఎస్‌ఐ శేఖర్‌బాబు వాగులు, కాలువలు ప్రమాదకరంగా ప్రహహిస్తున్న ప్రాంతాల మీదుగా ఎవరూ ప్రయాణించకుండా పోలీసు సిబ్బందిని ఉంచి చర్యలు తీసుకున్నారు.Read more