‘రెయిన్‌బో’పై దాడులు

ABN , First Publish Date - 2020-09-13T07:17:15+05:30 IST

నగరంలోని రెయిన్‌బో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిపై శనివారం అధికారులు దాడులు చేశారు. ఈ ఆసుపత్రిలో కరోనా రోగుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రెండు రోజుల క్రితం వైద్య ఆరోగ్యశాఖ ఆ ఆసుపత్రికి

‘రెయిన్‌బో’పై దాడులు

 ఓ నేత హెచ్చరికతో వెనుతిగిరిన అధికారులు?


నెల్లూరు(వైద్యం)సెప్టెంబర్‌ 12  : నగరంలోని రెయిన్‌బో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిపై శనివారం అధికారులు దాడులు చేశారు. ఈ ఆసుపత్రిలో కరోనా రోగుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రెండు రోజుల క్రితం వైద్య ఆరోగ్యశాఖ ఆ ఆసుపత్రికి నోటీసులు జారీ చేసింది. కరోనా బాధితులకు అందించిన చికిత్స వివరాలు, కంప్యూటర్‌ బిల్లులు 48 గంటల్లో అందజేయాలని ఆదేశించింది. నిర్వాహకులు స్పందించకపోవడంతో  అధికారులు దాడులు చేశారు.


రికార్డులు పరిశీలించి ఆసుపత్రిని సీజ్‌ చేయాలని నిర్ణయించారు. ఇంతలోపు ఓ అధికారపార్టీ నేత జోక్యంతో అధికారులు అక్కడ నుంచి వెనుదిరిగినట్లు తెలుస్తోంది. మరో రెండు రోజులు గడువు ఇచ్చి కంప్యూటర్‌ బిల్లులు, కరోనా చికిత్స వివరాలు తెలిపాలని నిర్వాహకులను హెచ్చరించి వెళ్లినట్లు  సమాచారం. దాడుల్లో ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌, డీఎస్సీ మల్లికార్జునరెడ్డి, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటప్రసాద్‌, అమరేంద్రనాథ్‌రెడ్డి  పాల్గొన్నారు.


కానిస్టేబుళ్ల బదిలీ

నెల్లూరు(క్రైం)సెప్టెంబరు 12 : జిల్లాలో శనివారం పలువురు కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 11 మంది కానిస్టేబుళ్లతోపాటు ముగ్గురు హెడ్‌ కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు.

Updated Date - 2020-09-13T07:17:15+05:30 IST