కల్లు దుకాణాలపై దాడి : ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2020-03-28T06:22:03+05:30 IST

వెంకటగిరిలో కల్లు విక్రయాలపై ఎక్సైజ్‌ శాఖ శుక్రవారం మండలంలోని పాపమాంబాపురం, పెరియవరంలో దాడులు

కల్లు దుకాణాలపై దాడి : ఇద్దరి అరెస్టు

ఆంద్రజ్యోతి ఎఫెక్ట్‌


వెంకటగిరి, మార్చి 27: వెంకటగిరిలో కల్లు విక్రయాలపై ఎక్సైజ్‌ శాఖ శుక్రవారం మండలంలోని పాపమాంబాపురం, పెరియవరంలో దాడులు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేశారు. పాపమాంబాపురంలో మద్దం వెంకటరమణ, పెరియవరంలో అంతోటి మునిరాజమ్మ కల్లు విక్రయిస్తుడటంలో వారిని అదుపులోకి తీసుకుని ఒక్కొక్కరి నుంచి 5 లీటర్ల వంతున తాటి కల్లును స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ విజయకుమార్‌ తెలిపారు. ఆంధ్రజ్యోతిలో వెంకటగిరిలో మత్తుపదార్థాల విక్రయాలు శీర్షికతో వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందించి దాడులు నిర్వహించారు వెంకటగిరి పరిధిలో మత్తు పదార్థాల విక్రయాలపై సమాచారం ఇవ్వాలని సీఐలు అన్వర్‌బాషా, విజయకుమార్‌ తెలిపారు. 


Updated Date - 2020-03-28T06:22:03+05:30 IST