చోరీ కేసులో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-12-02T03:34:15+05:30 IST

గతనెల 21వ తేదీన మండలంలోని చెర్లోపల్లిలో అల్లూరు హేమంత్‌కుమార్‌ ఇంట్లో చోరీ జరిగిన విషయం విదితమే. చోరీకి పాల్ప

చోరీ కేసులో నిందితుడి అరెస్టు

 మనుబోలు, డిసెంబరు 1: గతనెల 21వ తేదీన మండలంలోని చెర్లోపల్లిలో అల్లూరు హేమంత్‌కుమార్‌ ఇంట్లో చోరీ జరిగిన విషయం విదితమే. చోరీకి పాల్పడిన నిందితుడు ఇంట్లోని 3సవర్ల బంగారం, రూ.74వేల నగదుతోపాటు పక్కింట్లో ఆరుబయట ఉన్న మోటార్‌సైకిల్‌ను తీసుకెళ్లాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు మనుబోలు బైపాస్‌లోని ఓ హోటల్‌ వద్ద తస్కరించిన మోటార్‌సైకిల్‌ ఉండగా గుర్తించి, దాని సమీపంలో ఓ వ్యక్తిని సోమవారం అదుపులోకి తీసుకుని విచారించారు. హేమంత్‌ కుమార్‌ ఇంట్లో చోరీకి పాల్పడింది చెన్నైకి చెందిన బానా డేవిడ్‌గా ధ్రువీకరించారు. డేవిడ్‌ జిల్లాలో జరిగిన పలు చోరీల్లో శిక్ష అనుభవించి గత నెల 21న జిల్లా కేంద్ర కారాగారం నుంచి బయటకు వచ్చాడు. అదేరోజు డబ్బుల కోసం మరోమారు చోరీకి పాల్పడ్డాడు. అతడి వద్దనున్న మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు మంగళవారం ఏఎస్‌ఐ డేవిడ్‌ దాసు తెలిపారు.

Updated Date - 2020-12-02T03:34:15+05:30 IST