కొండ్లపూడిని దత్తత తీసుకున్న ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2020-08-18T11:49:23+05:30 IST

నెల్లూరు రూరల్‌ మండలంలోని కొండ్లపూడి గ్రామాన్ని నెల్లూరులోని వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు దత్తత తీసుకున్నారు.

కొండ్లపూడిని దత్తత తీసుకున్న ఏఆర్‌ఎస్‌ శాస్త్రవేత్తలు

నెల్లూరు (రూరల్‌), ఆగస్టు 17 : నెల్లూరు రూరల్‌ మండలంలోని కొండ్లపూడి గ్రామాన్ని నెల్లూరులోని వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు దత్తత తీసుకున్నారు. సోమవారం ఆ గ్రామంలో వ్యవసాయ అధికారులతో కలిసి పర్యటించి అక్కడి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వరి పొలాలను పరిశీలించారు. పైరుకు సోకే వ్యాధులు, నివారణ మార్గాలను ప్రయోగాత్మకంగా వివరించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. గ్రామంలోని రైతులను చైతన్యపరచి తమ పరిశోధనల ఫలితాలను వారికి అందిస్తామని శాస్త్రవేత్తలు డాక్టర్‌ వినీత, మధుసూదన్‌రావు, పరమశివం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ బాలాజీనాయక్‌, ఏవో జోత్స్నరాణి పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-18T11:49:23+05:30 IST