దర్గా అరుగు జెండాలు దగ్ధం

ABN , First Publish Date - 2020-03-18T10:09:45+05:30 IST

కావలిపట్టణ ఉత్తరశివార్లలో జెండాచెట్టు వద్ద ముస్లింలు, హిందువులు కలిసి పూజించుకునే ఓ దర్గా అరుగు వద్ద ఉన్న జెండాలను మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని

దర్గా అరుగు జెండాలు దగ్ధం

నిందితుడి అరెస్ట్‌


కావలి, మార్చి17: కావలిపట్టణ ఉత్తరశివార్లలో జెండాచెట్టు వద్ద ముస్లింలు, హిందువులు కలిసి పూజించుకునే ఓ దర్గా అరుగు వద్ద ఉన్న జెండాలను మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. కాగా ముస్లిం మతానికి చెందిన ఈ జెండాలను తగులబెట్టడంతో మతపరమైన అంశాలు వస్తాయేమోనని తొలుత పోలీసులు ఆందోళన చెందారు. అయితే పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా జెండాలు తగులపెట్టిన షేక్‌ కాలేషాను మంగళవారం ఉదయం గుర్తించి అరెస్ట్‌ చేయటంతో సమస్యను చాకచక్యంగా పోలీసులు పరిష్కరించారు.


మంగళవారం మధ్యాహ్నం డీఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో కావలి డీఎస్పీ డీ ప్రసాద్‌, సీఐ ఎం. రోశయ్య, ఎస్సై వెంకట్రావు జరిగిన సంఘటన అరెస్ట్‌ వివరాలను వెల్లడించారు. జెండాచెట్టు అరుగు వద్ద జెండాలు తగులబెట్టిన విషయాన్ని స్థానికుడు షేక్‌ ఖాదర్‌బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు.


దీనిపై ఒకటోపట్టణ సీఐ ఎం. రోశయ్య, ఎస్సై వెంకట్రావు కేసు నమోదుచేసి దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సీసీ కెమెరాల సాక్ష్యాల ఆధారంగా జెండాలను తగులబెట్టింది షేక్‌ మస్తాన్‌గా గుర్తించారు. దీంతో అతడిని అరెస్ట్‌చేసి విచారించగా మద్యం మత్తులో జెండాలు తగులపెట్టానని అంగీకరించటంతో  ఆయనను కోర్టుకు హాజరుపరిచినట్లు పోలీసులు  తెలిపారు.

Updated Date - 2020-03-18T10:09:45+05:30 IST