పోలీసుల అదుపులో దొంగల ముఠా
ABN , First Publish Date - 2020-12-06T03:10:36+05:30 IST
బుచ్చితోపాటు చుట్టు పక్కల మండలాల్లోని పొట్టేళ్లు, గొర్రెలు, బైక్‌ల చోరీలకు పాల్పడే ఓ దొంగలముఠాను పోలీసులు శనివారం
బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు5:బుచ్చితోపాటు చుట్టు పక్కల మండలాల్లోని పొట్టేళ్లు, గొర్రెలు, బైక్‌ల చోరీలకు పాల్పడే ఓ దొంగలముఠాను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ దొంగల ముఠా కొంత కాలంగా మండలంతోపాటు పలు మండలాల్లో పొట్టేళ్లు, బైక్‌లు దొంగతనాలు చేసేవారుగా తెలిసింది. ఈ ముఠాతోపాటు వారు ఉపయోగించిన కారును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డిని వివరణ కోరగా విచారిస్తున్నట్లు తెలిపారు.