ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-03-08T09:47:52+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనందున జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

అలసత్వం వహిస్తే చర్యలు

ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలి

కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు


నెల్లూరు ( జడ్పీ), మార్చి 7 : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనందున జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ, పంచాయతీ అధికారులతో ఆయన శనివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎవరి బాధ్యతలను వారు విజయవంతంగా  పూర్తి చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 5,500 బ్యాలెట్‌ బాక్సులు సిద్ధంగా ఉన్నాయని, మరో 2,600 బాక్సుల కొరత ఉన్నందున వెంటనే సరఫరా చేయాలని ఎన్నికల కమిషనర్‌ను కోరుతామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ఆదివారం ప్రకటిస్తామన్నారు. సమావేశంలో డీఆర్వో మల్లికార్జున, జడ్పీ సీఈవో సుశీల, పంచాయతీ అధికారి ధనలక్ష్మి పాల్గొన్నారు. 


Updated Date - 2020-03-08T09:47:52+05:30 IST