-
-
Home » Andhra Pradesh » Nellore » arrach brand seazed
-
సారా, మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2020-12-29T04:34:15+05:30 IST
అక్రమంగా తరలిస్తున్న ఐదు లీటర్ల సారా, ఏడు మద్యం సీసాలను సోమవారం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఈబీ ఇన్‌చార్జి సీఐ శేషమ్మ తెలిపారు.

నాయుడుపేట టౌన్, డిసెంబరు 28 : అక్రమంగా తరలిస్తున్న ఐదు లీటర్ల సారా, ఏడు మద్యం సీసాలను సోమవారం స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఈబీ ఇన్‌చార్జి సీఐ శేషమ్మ తెలిపారు. పూడేరు గ్రామం వద్ద మాల్యాద్రి ఐదు లీటర్ల సారా క్యాన్‌ను తీసుకువెళ్తుండగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పుదూరు గ్రామం వద్ద అక్రమంగా తరలిస్తున్న 7 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితుడు శ్రీహరిని అరెస్టు చేసినట్లు శేషమ్మ తెలిపారు. సారాయి ఎక్కడ తయారు చేశారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.