ఆర్టీసీ డిస్పెన్సరీకి వైద్యాధికారి కోసం దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-12-30T05:15:00+05:30 IST

ఏపీఎస్‌ ఆర్టీసీ డిస్పెన్సరీలో కాంట్రాక్ట్‌ పద్ధతిన వైద్యాధికారిగా విధులు నిర్వహించేందుకు అర్హత అనుభవం కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం శేషయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఆర్టీసీ డిస్పెన్సరీకి వైద్యాధికారి కోసం  దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), డిసెంబరు 29: ఏపీఎస్‌ ఆర్టీసీ డిస్పెన్సరీలో కాంట్రాక్ట్‌ పద్ధతిన వైద్యాధికారిగా విధులు నిర్వహించేందుకు అర్హత అనుభవం కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం శేషయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంబీబీఎస్‌, ఆపైన విద్యార్హత, రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలని,  60 ఏళ్లలోపు వయసు వారు అర్హులన్నారు. దరఖాస్తులను ఆర్‌ఎం కార్యాలయంలో జనవరి 10వ తేదీలోపు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు 9959225640 నెంబరును సంప్రదించాలని కోరారు. 

Updated Date - 2020-12-30T05:15:00+05:30 IST