ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-07-18T11:21:25+05:30 IST

ఆదర్శ పాఠశాలలలో ఇంటర్‌లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఏఎస్‌పేట పాఠశాల ప్రిన్సిపాల్‌ షేక్‌ హుస్సేన్‌ పీరా, కలిగిరి ఆదర్శ ..

ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తులు

ఏఎస్‌పేట/కలిగిరి, జూలై 17 : ఆదర్శ పాఠశాలలలో ఇంటర్‌లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఏఎస్‌పేట పాఠశాల ప్రిన్సిపాల్‌ షేక్‌ హుస్సేన్‌ పీరా, కలిగిరి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ ఇందిర వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులకు ఈ నెల 30వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అలాగే కలిగిరిలో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులకు ఈ నెల 25 వరకు గడువుందని చెప్పారు. 

Updated Date - 2020-07-18T11:21:25+05:30 IST