అభ్యర్థులు సర్టిఫికెట్‌లతో హాజరు కావాలి

ABN , First Publish Date - 2020-09-21T10:17:14+05:30 IST

అభ్యర్థులు సర్టిఫికెట్‌లతో హాజరు కావాలి

అభ్యర్థులు సర్టిఫికెట్‌లతో హాజరు కావాలి

నెల్లూరు(వైద్యం)సెప్టెంబర్‌ 20 : వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్‌నర్సులు, ల్యాబ్‌ టెక్నిషియన్లు, ఫార్మాసిస్ట్‌ల పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిపై ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్‌లతో హాజరు కావాలని డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 103 స్టాఫ్‌నర్సులు, 50 మంది ల్యాబ్‌ టెక్నిషియన్లు, 22 మంది ఫార్మాసిస్ట్‌లకు సంబందించి ఈ నెల 22న ఫార్మాసిస్ట్‌, ఎల్టీలకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాల యంలో సర్టిఫికెట్‌ల పరిశీలన ఉంటుందన్నారు. అలాగే స్టాఫ్‌ నర్సులకు 23న  పరిశీలన ఉంటుందని, పరిశీలనకు హాజరు కాకపోతే మెరిట్‌ జాబితా నుంచి వారిని తొలగిస్తామని తెలిపారు.

Updated Date - 2020-09-21T10:17:14+05:30 IST