చీకటి పడితే మందుబాబులకు వేదిక

ABN , First Publish Date - 2020-12-11T05:50:04+05:30 IST

పేరుకే మేజర్‌ పంచాయతీగా అనంతసాగరం. వీధుల్లోనే కాదు ప్రభుత్వ కార్యాలయాల వద్ద చీకటి పడితే అంధకారం అలుముకుంటోంది

చీకటి పడితే మందుబాబులకు వేదిక
ఎంపీడీవో కార్యాలయం

ప్రభుత్వ కార్యాలయాల దగ్గర అంధకారం

వీధి దీపాలు లేక అవస్థలు

రికార్డులకు భద్రత కరువు

అనంతసాగరం, డిసెంబరు 10: పేరుకే మేజర్‌ పంచాయతీగా అనంతసాగరం. వీధుల్లోనే కాదు ప్రభుత్వ కార్యాలయాల వద్ద చీకటి పడితే అంధకారం అలుముకుంటోంది. రాత్రి పూట కార్యాలయాల్లో ని రికార్డులకు భద్రత కరువైంది. ఎంపీడీవో, విద్యాశాఖ కార్యాలయాలు గ్రామానికి దూరంగా ఉన్నాయి. అక్కడ దీపాలు లేని కారణంగా చీకటి పడితే మద్యం ప్రియులకు వేదికవు తోంది. అయినా అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదు. అంధకారం నెలకొన డంతో పాటు రికార్డులకు భద్రత కూడా కరువైంది. అధికారులు చొరవ తీసుకుని వీధి దీపాలు ఏర్పాటు చేయించి భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2020-12-11T05:50:04+05:30 IST