ఎయిడ్స్‌కు చికిత్స కంటే నివారణే మార్గం

ABN , First Publish Date - 2020-12-01T05:30:00+05:30 IST

ఎయిడ్స్‌ వ్యాధికి చికిత్స కంటే నివారణే మార్గమని ప్రభుత్వ వైద్యుడు డాక్టర్‌ సురేంద్ర తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా మంగళవారం బుజబుజ నెల్లూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పీఎంపీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది.

ఎయిడ్స్‌కు చికిత్స కంటే నివారణే మార్గం
మాట్లాడుతున్న డాక్టర్‌ సురేంద్ర

 డాక్టర్‌ సురేంద్ర నెల్లూరు(వైద్యం), డిసెంబరు 1 : ఎయిడ్స్‌ వ్యాధికి చికిత్స కంటే నివారణే మార్గమని ప్రభుత్వ వైద్యుడు డాక్టర్‌ సురేంద్ర తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా మంగళవారం బుజబుజ నెల్లూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పీఎంపీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఆయన మాట్లాడుతూ దాదాపు 40 ఏళ్లుగా ఎయిడ్స్‌ వ్యాధి ప్రపంచానికి సవాల్‌గా మారిందని, జిల్లా ప్రజలకు ఆ వ్యాధిపై అవగాహన కల్పించటంలో పీఎంపీలు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థి దశలోనే వ్యాధిపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం డాక్టర్‌ సురేంద్రను నిర్వాహకులు సన్మానించారు. గోరంట్ల శేషయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పీఎంపీ సంఘం జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్‌, రూడ్స్‌ సంస్థ అధ్యక్షుడు రసూల్‌, హెచ్‌ఎం మల్లికార్జున, ఆదిశేషు, సాయి, బ్రహ్మరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


ఎన్‌సీసీ నావల్‌ క్యాడెట్స్‌ ర్యాలీ

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), డిసెంబరు 1 : ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా 10వ ఆంధ్ర నావెల్‌ యూనిట్‌ ఎన్‌సీసీ కమాండింగ్‌ అధికారి కెప్టెన్‌ జీఎస్‌ యుగంధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఎన్‌సీసీ క్యాడెట్లు గాంధీబొమ్మ సెంటర్‌ నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. యుగంధర్‌రెడ్డి మాట్లాడుతూ అశ్రద్ధ చేస్తే కలిగే అనర్థాలపై విస్తృత ప్రచారం చేయడం వల్ల ఎయిడ్స్‌ను నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ కళాశాల, సర్వోదయ కళాశాల, విడవలూరు డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ క్యాడెట్స్‌, లెఫ్టినెంట్‌ డాక్టర్‌ ఎన్‌ ప్రభాకర్‌, విజయ్‌ మహేష్‌, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు. 

డీకేడబ్ల్యూ కళాశాలలో ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మస్తానయ్య మాట్లాడుతూ అవగాహనతోనే ఎయిడ్స్‌ రహిత సమాజాన్ని స్థాపించవచ్చన్నారు. దీనిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మజ, సరేంద్ర, రాణి, నాగశ్యామల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T05:30:00+05:30 IST