మరో మృతదేహం వెలికితీత

ABN , First Publish Date - 2020-05-09T08:39:20+05:30 IST

చేపల వేటకు వెళ్లి చెరువులో గల్లంతైన సంగనపల్లి ప్రసాద్‌ (35) మృతదేహాన్ని శుక్రవారం వెలికితీశారు

మరో మృతదేహం వెలికితీత

పెళ్లకూరు, మే 8 : చేపల వేటకు వెళ్లి చెరువులో గల్లంతైన సంగనపల్లి ప్రసాద్‌ (35) మృతదేహాన్ని శుక్రవారం వెలికితీశారు. వివరాలిలా ఉన్నాయి. గురువారం మండలంలోని పాలచ్చూరు చెరువులో చేపల వేటకు వెళ్లిన బాపనపాటి చంద్రయ్య (40), సంగనపల్లి ప్రసాద్‌లు ప్రమాదవశాత్తు మునిగిపోయి గల్లంతయ్యారు. స్థానికులు చెరువులో గాలించి బాపనపాటి చంద్రయ్య మృతదేహాన్ని వెలికితీశారు. బాపనపాటి ప్రసాద్‌ కోసం  అగ్నిమాపక  సిబ్బంది రాత్రి వరకూ ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు.


శుక్రవారం ఉదయం మరోసారి గాలించగా ప్రసాద్‌ మృతదేహాం నీటిపై తేలింది. అనంతరం పోలీసులు రెండు మృతదేహాలను నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి  పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతుల కుటుంబసభ్యులను మాజీ ఎంపీపీ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఎన్‌డీసీసీ డైరెక్టర్‌ మద్దాల సోమశేఖర్‌రెడ్డి, సొసైటీ మాజీ  అధ్యక్షుడు కాటంరెడ్డి రామలింగారెడ్డి, మల్లికార్జునరెడ్డి, మాధవరెడ్డి పరామర్శించారు.

Updated Date - 2020-05-09T08:39:20+05:30 IST