మరో 9 కరోనా పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2020-05-13T10:27:02+05:30 IST

నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయని అనుకుంటున్న సమయంలో కోయంబేడు లింకులు

మరో 9 కరోనా పాజిటివ్‌లు

మరొక బాధితుడు డిశ్చార్జ్‌


నెల్లూరు(వైద్యం) మే 12 : నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయని అనుకుంటున్న సమయంలో కోయంబేడు లింకులు వణుకుపుట్టిస్తోంది. సూళ్లూరుపేటలోమంగళవారం 9 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో జిల్లా యంత్రాంగం అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టింది. కలెక్టర్‌ శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌, ఇతర అధికారులు పట్టణంలో విస్తృతంగా పర్యటించి, అధికారులకు సూచనలు సలహాలు చేశారు. కాగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య జిల్లాలో మొత్తం 111కు చేరుకుంది, ఇదిలాఉంటే నారాయణ ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న నెల్లూరుకు చెందిన మహిళను మంగళవారం డిశ్చార్జ్‌ చేశారు.

Read more