మరో 13 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-05-19T07:11:48+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపుతోంది. సోమవారం వైద్య శాఖ ప్రకటించిన బులిటెన్‌లో 13

మరో 13 కరోనా పాజిటివ్‌ కేసులు

9 మంది బాధితులు డిశ్చార్జ్‌ 

ఇందులో 9 నెలల చిన్నారి 


నెల్లూరు (వైద్యం), మే 18 : జిల్లాలో కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపుతోంది. సోమవారం వైద్య శాఖ ప్రకటించిన బులిటెన్‌లో 13 పాజిటివ్‌ కేసులు నమోదవగా ఇందులో 10 మంది సూళ్లూరుపేట,  వింజమూరులో ఇద్దరు, ఒకరు మనుబోలు వాసి ఉన్నారు. ఇవన్నీ కోయంబేడు లింకులు ఉన్నవే. ఇప్పటివరకు సూళ్లూరుపేటలోనే 42 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇళ్లలో నుంచి బయటకు వచ్చి నిత్యావసర వస్తువుల కొనుగోలు చేయాలన్నా ఇబ్బందులు పడుతున్నారు.


ఇదిలాఉంటే ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 164 మంది కరోనా పాజిటివ్‌కు గురయ్యారు. అలాగే కరోనాతో కోలుకున్న 9 మందిని కూడా అధికారులు డిశ్చార్జ్‌ చేశారు. నారాయణ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న వాకాడుకు చెందిన ఇద్దరు, నెల్లూరులో ఏడుగురిని డిశ్చార్జ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ ఆసుపత్రి సీఈవో డాక్టర్‌ సతీ్‌షకుమార్‌, అదనపు సూపరింటెండ్‌ డాక్టర్‌ బీజూ రవీంద్రన్‌, కరోనా నోడల్‌ అధికారి డాక్టర్‌ సుబ్బారావు, ఆసుపత్రి ఏజీఎం భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కోలుకున్న 9 నెలల చిన్నారి

కరోనా పాజిటివ్‌కు గురైన 9 నెలల చిన్నారి నారాయణ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకుంది. నెల్లూరులోని కోటమిట్టకు చెందిన ఈ చిన్నారికి ఢిల్లీ కాంట్రాక్టు కారణంగా కరోనా వైరస్‌ సోకింది. ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఎవరికి వ్యాధి లక్షణాలు లేకపోగా ఈ చిన్నారి కరోనా బారిన పడటం విశేషం. ఈ నెల మొదటి వారంలో తల్లితోపాటు చిన్నారిని పరీక్షించగా, తల్లికి నెగిటివ్‌, చిన్నారికి పాజిటివ్‌ రావడంతో ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే కరోనా లక్షణాలు తీవ్రంగా లేకపోవడంతో క్లోరోక్విన్‌ మాత్రలు, అజిత్రోమైసిన్‌ లిక్విడ్‌ తక్కువ మోతాదుతో వైద్యులు చికిత్స అందించడంతో ఆ చిన్నారి పూర్తిగా కోలుకుంది. 

Updated Date - 2020-05-19T07:11:48+05:30 IST