సచివాలయ సిబ్బందిపై జేసీ ఆగ్రహం
ABN , First Publish Date - 2020-12-02T04:42:11+05:30 IST
జేసీ ప్రభాకర్‌రెడ్డి మండలంలోని కంబాలపల్లి సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాపూరు, డిసెంబరు 1 : జేసీ ప్రభాకర్‌రెడ్డి మండలంలోని కంబాలపల్లి సచివాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం కంబాలపల్లి, సంకురాత్రిపల్లి, వేపినాపి, రాపూరు 2 సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. తొలుత సందర్శించిన కంబాలపల్లి సచివాలయంలో శుభ్రత లేదంటూ సిబ్బంది తీరుపై మండిపడ్డారు. పద్ధతులు మార్చుకోవాలని హెచ్చరించారు. నిర్మాణంలో ఉన్న సచివాలయం భవనాల కొలతలు తీయించారు. వేపినాపి పీహెచ్‌నీ తనిఖీ చేశారు. పౌష్టికాహారం అందించారు. ఆయన వెంట మండల అధికారులు ఉన్నారు.