గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-03-23T10:21:04+05:30 IST

స్థానిక రైల్వే స్టేషన్‌ పరిధిలోని వినాయకుడి గుడి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

గూడూరు(రూరల్‌), మార్చి 22: స్థానిక రైల్వే స్టేషన్‌ పరిధిలోని వినాయకుడి గుడి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించి రైల్వేపోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయసు 40ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. గుర్తించలేని స్థితిలో మృతదేహం ఉండడంతో ఇతను మృతి చెంది వారం రోజులై ఉండవచ్చని రైల్వే పోలీసులు తెలిపారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Updated Date - 2020-03-23T10:21:04+05:30 IST