అమరావతి రైతులకు మద్దతుగా ర్యాలీ

ABN , First Publish Date - 2020-12-18T04:45:36+05:30 IST

అమరావతి రాజధాని రైతులకు మద్ద తుగా గురువారం ఆత్మకూరు పట్ట ణంలో టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

అమరావతి రైతులకు మద్దతుగా ర్యాలీ
తహసీల్దారుకు వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నాయకులు

ఆత్మకూరు, డిసెంబరు 17: అమరావతి రాజధాని రైతులకు మద్ద తుగా గురువారం ఆత్మకూరు పట్ట ణంలో టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక మున్సిపల్‌ బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడ నుంచి ర్యాలీ ప్రారంభమై సోమశిల రోడ్డు సెంటర్‌ వరకు సాగింది. అక్కడ మానవహారం గా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని అధికారులకు విన తిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లా డుతూ అమరావతిలో రైతులు చేస్తున్న దీక్ష 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమా లు కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత రాజ ధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా తమ పొలాలను ఇచ్చిన రైతులకు ప్రతిఒక్కరు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చండ్రా వెంకట సుబ్బానాయుడు, పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, తెలుగు యువత ఉపాధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి కేతా విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వల్లూరు వెంకటరమణారెడ్డి, తెలుగు మహిళ మండల అధ్యక్షురాలు పులిమి శైలజారెడ్డి, మాజీ కౌన్సిలర్‌ కొత్తపల్లి రమేష్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు మొగల్‌ యస్థానీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-18T04:45:36+05:30 IST