అన్ని దారులు బంద్
ABN , First Publish Date - 2020-04-21T05:30:00+05:30 IST
లాక్‌డౌన్ నేపథ్యంలో పట్టణంలోకి వచ్చే అన్ని దారులనూ పోలీసులు ఆదివారం మూసివేశారు. అత్యవసరమైతేనే పట్టణంలోకి అనుమతిస్తున్నారు. లేదంటే వెనక్కి...

వెంకటగిరి, ఏప్రిల్ 20 : లాక్‌డౌన్ నేపథ్యంలో పట్టణంలోకి వచ్చే అన్ని దారులనూ పోలీసులు ఆదివారం మూసివేశారు. అత్యవసరమైతేనే పట్టణంలోకి అనుమతిస్తున్నారు. లేదంటే వెనక్కి పంపేస్తున్నారు. సరైన సమాధానం ఇవ్వని వారిపై కేసులు నమోదుచేస్తున్నారు. సీఐ అన్వర్ బాషా, ఎస్‌ఐ గోపి పట్టణంలో తిరుగుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రోజులాగే ఉదయం 6 నుంచి 9 గంటలకు వరకు నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
డక్కిలి: లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేసేందుకు పోలీసులు ఆదివారం మండలాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. రాపూరు-వెంకటగిరి ఎన్‌హెచ్ 565 జాతీయ రాహదారి తోపాటు, పలు గ్రామాలకు వెళ్లే కూడళ్లల్లో గ్రామ మహిళా పోలీసులను ఏర్పాటుచేశారు. అనవసరంగా రోడ్డుపైకి వచ్చే వారిని నిర్దాక్షణ్యంగా నిలిపివేస్తున్నారు. ప్రజాప్రతినిధులైనా, రాజకీయ పార్టీల నేతలైనా ఎందుకోసం వెళుతున్నారో, వస్తున్నారో చెప్పాల్సిందే అంటున్నారు. అనవసరంగా రాకపోకలు సాగించే వారిని పోలీసులు మొహమాటానికి పోయి చూసీచూడనట్లు ఉండడంతో ఎస్‌ఐ గోపి మహిళా పోలీసులకు ఆ బాధ్యతలు అప్పజెప్పారు. దాంతో అన్ని మార్గాల్లో జనసంచారం బాగా తగ్గింది.
