అర్హులందరికీ రేషన్‌ సరుకులు : సబ్‌కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-03-30T10:00:28+05:30 IST

అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్‌ బియ్యం, కందిపప్పు ఉచితంగా అందజేస్తున్నట్లు సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ తెలిపారు.

అర్హులందరికీ రేషన్‌ సరుకులు : సబ్‌కలెక్టర్‌

గూడూరు, మార్చి 29: అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్‌ బియ్యం, కందిపప్పు ఉచితంగా అందజేస్తున్నట్లు సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ  తెలిపారు. ఆదివారం పలు రేషన్‌ దుకాణాలను సబ్‌కలెక్టర్‌ పరిశీలించారు.  ఆయన మాట్లాడుతూ దుకాణాల వద్ద ఇబ్బందులు లేకుండా సామాజిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా త్వరితగతిన సరుకులు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు లీలారాణి పాల్గొన్నారు.

Updated Date - 2020-03-30T10:00:28+05:30 IST