మద్యరహిత ఆంధ్రప్రదేశే లక్ష్యం

ABN , First Publish Date - 2020-09-20T09:56:59+05:30 IST

మద్యరహిత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ లక్ష్యం అని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. నగరంలోని జిల్లా ఎక్సైజ్‌ శాఖ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడు

మద్యరహిత ఆంధ్రప్రదేశే లక్ష్యం

 మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వల్లంరెడ్డి 

నెల్లూరు(క్రైం)సెప్టెంబరు 19 : మద్యరహిత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ లక్ష్యం అని ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. నగరంలోని జిల్లా ఎక్సైజ్‌ శాఖ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దశలవారీ మద్యనిషేధ చర్యలను  డ్వాక్రా సంఘాల మహిళలు, సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన డీ అడిక్షన్‌ కేంద్రాల ద్వారా ఎంతో మంది మందుబాబులో మార్పు వస్తోందన్నారు. దశలవారీ మద్యనిషేధంపై ఔత్సాహిక దర్శకుల నుంచి షార్ట్‌ఫిల్మ్‌ల పోటీలకు ఈ నెల 25 వరకు ఎంట్రీలను దాఖలు చేయాలన్నారు. అక్టోబరు 2న ఉత్తమ షార్ట్‌ఫిల్మ్‌కు బహుమతి అందిస్తామన్నారు. పాఠశాలలు తెరిచాక మద్యపాన నిషేధంపై పలు రకాల పోటీలు నిర్వహిస్తామన్నారు.


    ప్రభుత్వం త్రీస్టార్‌, ఫైవ్‌స్టార్‌ హోటళ్లకు మాత్రమే మద్యం పరిమితం చేసేలా అడుగులు వేస్తోందన్నారు.  కార్యక్రమంలో ఏసీ శ్రీరామచంద్రమూర్తి, ఈఎస్‌ వెంకటరామిరెడ్డి, నవోదయ జిల్లా కమిటీ సభ్యుడు మాలకొండారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-09-20T09:56:59+05:30 IST