-
-
Home » Andhra Pradesh » Nellore » alcohol bandh for another 4 days
-
మరో 4రోజులు..మందు బంద్
ABN , First Publish Date - 2020-03-23T10:02:54+05:30 IST
కరోనా ప్రభావంతో జిల్లాలో మరో నాలుగు రోజులు మద్యం అమ్మకాలపై యంత్రాంగం నిషేధం విధించింది.

నెల్లూరు (క్రైం), మార్చి 22 : కరోనా ప్రభావంతో జిల్లాలో మరో నాలుగు రోజులు మద్యం అమ్మకాలపై యంత్రాంగం నిషేధం విధించింది. సోమవారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు దుకాణాలు, బార్లు మూసి వేయాలని కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. 26వతేదీ తర్వాత కూడా అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలో మద్యం దుకాణాలు, బార్లు మూతపడ్డాయి. తాజాగా కలెక్టర్ ఆదేశాలతో మరో నాలుగు రోజులు ఈ నిషేదాజ్ఞలు కొనసాగున్నాయి.