వేణుగోపాల హరే..!
ABN , First Publish Date - 2020-12-21T04:51:55+05:30 IST
నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి, మూలాపేట వేణుగోపాల స్వామి ఆలయాల్లో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

వైభవంగా అధ్యయనోత్సవాలు
నెల్లూరు(సాంస్కృతికం), డిసెంబరు 20 : నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి, మూలాపేట వేణుగోపాల స్వామి ఆలయాల్లో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఆదివారం ఆరో రోజుకు చేరాయి. వేణుగోపాలస్వామి అదే అలంకరణలో దర్శనమిచ్చారు. మూలవర్లకు పూలంగిసేవ, అళ్వార్లు ఘోష్టి, దివ్యనాలాయిర ప్రబంధఘోష్టిగానం, విష్ణు సహస్రనామార్చన జరిగాయి. గోదాదేవికి తిరుప్పావై, ప్రాకారోత్సవం, ఊంజల్‌సేవ జరిగాయి. ధనుర్మాసం దీపారాధన కన్నుల పండువగా జరిగాయి. ఆలయ చైౖర్మన్ మన్నెం లక్ష్మీనాథరెడ్డి, మజ్జిగ చంద్రమౌళిరెడ్డి, ఆనం చంద్రశేఖర్‌రెడ్డి, ఈవో సహాయ కమిషనర్ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. రంగనాఽథస్వామి ఆలయంలో విశేష పూజలు, పుష్పాలంకారం, ఆళ్వార్లుఘోష్టి, ప్రాకారోత్సవం జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ కోట గురుబ్రహ్మం, ధర్మకర్తలు, ఈవో వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. అయ్యప్పగుడిలోని గురువాయురప్పన్ ఆలయంలో ధనుర్మాసం పూజలు ఘనంగా జరిగాయి. గోదాదేవికి తిరుప్పావై పూజలు, స్వామికి విష్ణు సహస్రనామ పూజలు జరిగాయి. అలాగే అయ్యప్ప ఆలయంలో మండల పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉదయం పాలాభిషేకం, గణపతి హోమం, కలిశపూజ, ఉచ్ఛపూజ, నవకాభిషేకం, శ్రీవేలి ఉత్సవం, అన్నదానం జరిగాయి. సాయంత్రం పూలంగిసేవ, భగవతి సేవ, పడికర్పూర హారతులు జరిగాయి. ఆలయ కార్యదర్శి జీ శేషగిరిరావు, రమణయ్య, విజయకుమార్, కేవీ రత్నం పర్యవేక్షించారు.