అంబానీ, అదానీల సేల్స్‌మెన్‌లా ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-12-27T02:04:21+05:30 IST

అంబానీ, అదానీల సేల్స్‌మెన్‌లా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని సీపీఎం సెంట్రల్‌ కమిటీ సభ్యుడు వీ శ్రీనివాసరావు

అంబానీ, అదానీల సేల్స్‌మెన్‌లా ప్రధాని మోదీ
మాట్లాడుతున్న సీపీఎం సెంట్రల్‌ కమిటీ సభ్యుడు వీ శ్రీనివాసరావు

 -సీపీఎం సెంట్రల్‌ కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు

కావలిటౌన్‌ డిసెంబరు26: అంబానీ, అదానీల సేల్స్‌మెన్‌లా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని సీపీఎం సెంట్రల్‌ కమిటీ సభ్యుడు వీ శ్రీనివాసరావు ఆరోపించారు. శనివారం స్ధానిక సీపీఎం  కార్యాలయంలో  ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశానికి వెన్నుముక లాంటి రైతులు తమ హక్కుల కోసం,  నల్ల చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీలో నెల నుంచి ఉద్యమం చేస్తుంటే వారిని దేశద్రోహులుగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు.  రైతు ఉద్యమానికి మద్దతు పలికి సహకరిస్తే విదేఽశాలనుంచి నిధులు వస్తున్నాయని, విద్రోహ శక్తుల చేతుల్లో ఉద్యమం పోయిందని ప్రధాని ఆరోపించడం దేశరైతులను కించపరిచినట్లేనన్నారు. మోదీ, అమిత్‌షాలు ఇద్దరే దేశ భక్తులుగా మిగిలిన ప్రజలంతా దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో తిరిగి కేంద్రంలో అధికారంలో వచ్చేందుకే కార్పొరేట్‌ కంపెనీల చేతిలో రైతాంగాన్ని, అన్ని వ్యవస్ధలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.  సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు తాళ్లూరు మాల్యాద్రి, పట్టణ కమిటీ కార్యదర్శి పెంచులయ్య, సీఐటీయు జిల్లా నాయకులు వీ మల్లికార్జునరావు, సబ్బురాయశర్మ, తదితరులు పాల్గొన్నారు.


-----------


Updated Date - 2020-12-27T02:04:21+05:30 IST