రైతులకు మెరుగైన సేవలు అందించాలి
ABN , First Publish Date - 2020-12-02T04:13:07+05:30 IST
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు వ్యవసాయాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని గంటూరు కమిషనరేట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఏడీఏ లక్ష్మణబాబు పేర్కొన్నారు.

ఆత్మకూరు/ఏఎస్‌పేట, డిసెంబరు 1: రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు వ్యవసాయాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని గంటూరు కమిషనరేట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఏడీఏ లక్ష్మణబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఆల్మకూరు మండలం బట్టేపాడు, ఎస్‌పేట మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, విత్తనాలు, ఎరువులు, ల్యాబ్ సామగ్రిని పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఆత్మకూరు సబ్‌డివిజన్ వ్యవసాయ ఉపసంచాలకులు దేవసేన, మండల వ్యవశాయాధికారులు ప్రసాదరావు, రజని, సచివాలయం కార్యదర్శి హజరత్‌బాబు, వీఏఏ ఝాన్సీ, కమిషనర్ కార్యాలయ జూనియర్ అకౌంటెంట్ బాషా, జూనియర్ అసిస్టెంట్ నరే్‌ష, పీఆర్ ఏఈ ఖాదర్‌బాషా, తదితరులు పాల్గ్గొన్నారు.