పీఎన్‌ఎం కళాశాలపై చర్యలు : ఆర్‌ఐవో

ABN , First Publish Date - 2020-07-28T11:09:20+05:30 IST

నెల్లూరు జెండావీధిలోని పీఎన్‌ఎం మునిసిపల్‌ పాఠశాలలో నిర్వహిస్తున్న ఇంటర్‌ కళాశాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ..

పీఎన్‌ఎం కళాశాలపై చర్యలు : ఆర్‌ఐవో

నెల్లూరు (విద్య), జూలై 27 : నెల్లూరు జెండావీధిలోని పీఎన్‌ఎం మునిసిపల్‌ పాఠశాలలో నిర్వహిస్తున్న ఇంటర్‌ కళాశాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి మాల్యాద్రి చౌదరి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్‌బోర్డు అనుమతి లేకుండా అడ్మిషన్లు చేపడుతున్నట్లు ఆ కళాశాలపై ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలో  రికార్డులు పరిశీలించగా ఈ కళాశాలకు ఎలాంటి అనుమతులు లేవని గుర్తించామన్నారు. వీఆర్‌ కళాశాలలో నిర్వహిస్తున్న జూనియర్‌ కళాశాలకు మాత్రమే అనుమతులున్నాయని, పీఎన్‌ఎంకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. దీనిపై విచారణ చేపట్టి కళాశాలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Updated Date - 2020-07-28T11:09:20+05:30 IST