-
-
Home » Andhra Pradesh » Nellore » accident
-
లారీ ఢీకొని యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-11-28T05:11:08+05:30 IST
సూళ్లూరుపేట జాతీయ రహదారిపై తారకేశ్వరటెక్స్‌టైల్స్ సమీపాన శుక్రవారం రాత్రి లారీ ఢీకొని ఒక యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు.

సూళ్లూరుపేట, నవంబరు 27 : సూళ్లూరుపేట జాతీయ రహదారిపై తారకేశ్వరటెక్స్‌టైల్స్ సమీపాన శుక్రవారం రాత్రి లారీ ఢీకొని ఒక యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. దొరవారిసత్రం మండలం మైలాంగం గ్రామానికి చెందిన దువ్వూరు సుమంత్‌రెడ్డి (27) తడలో మొబైల్ షాపు నిర్వహిస్తూ రోజూ స్వగ్రామం నుంచి వెళ్లి వచ్చేవాడు. శుక్రవారం షాపు మూసేసి ఇంటికి మోటారు సైకిల్‌పై వెళ్తుండగా లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.