ఎస్‌ఈబీ అధికారిగా శ్రీధర్‌ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2020-05-17T10:00:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ( ఎస్‌ఈబీ ) జిల్లా అధికారిగా ఏఎస్పీ

ఎస్‌ఈబీ అధికారిగా శ్రీధర్‌ బాధ్యతల స్వీకరణ

నెల్లూరు(క్రైం), మే 16 : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ( ఎస్‌ఈబీ ) జిల్లా అధికారిగా ఏఎస్పీ శ్రీధర్‌ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ శ్రీధర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర సరిహద్దుల నుంచి మాద్యం, ఇసుక అక్రమ రవాణా కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్సైజ్‌, మైనింగ్‌ శాఖల సహకారంతో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. తడ సరిహద్దుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. 70 శాతం ఎక్సైజ్‌ సిబ్బంది ఈ బ్యూరో పరిధిలో పనిచేస్తారన్నారు.

Updated Date - 2020-05-17T10:00:00+05:30 IST