-
-
Home » Andhra Pradesh » Nellore » aasha anganvadis dharna
-
మాకు ‘సంక్షేమం’ అక్కర్లేదా?
ABN , First Publish Date - 2020-12-31T03:42:10+05:30 IST
అంగన్‌వాడీ, ఆశ వర్కర్ల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకుడు ముకుంద డిమాండ్ చేశారు.

ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తల ధర్నా
నాయుడుపేట టౌన్, డిసెంబరు 30 : అంగన్‌వాడీ, ఆశ వర్కర్ల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకుడు ముకుంద డిమాండ్ చేశారు. తహసీల్దారు కార్యాలయం ఎదుట బుధవారం అంగన్‌వాడీ, ఆశవర్కర్లు, సీఐటీయూ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ సమయంలో అంగన్‌వాడీ, ఆశవర్కర్లు ప్రతి కుటుంబానికి సేవలందించారని అటువంటి వారికి న్యాయం చేయాలన్నారు. అనంతరం తహసీల్దారు శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీల సంఘం ప్రాజెక్టు కార్యదర్శి శ్యామలమ్మ, ఆశ వర్కర్ల యూనియన్ నాయకురాలు సుజాత, శారద, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.