నెల్లూరు మీదుగా 34 ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2020-03-13T10:02:13+05:30 IST

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌ నుంచి నెల్లూరు జిల్లా మీదుగా పలు ప్రాంతాలకు

నెల్లూరు మీదుగా 34 ప్రత్యేక రైళ్లు

ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే


నెల్లూరు (వెంకటేశ్వరపురం), మార్చి 12 : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌ నుంచి నెల్లూరు జిల్లా మీదుగా పలు ప్రాంతాలకు జూన్‌ నెలలో 34 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌ పీఆర్వో మండ్రప్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ - రామేశ్వరం, హైదరాబాద్‌కు ఎనిమిది రైళ్లు, హైదరాబాద్‌-తిరుచాపల్లి, హైదరాబాద్‌కు 10 రైళ్లు, హైదరాబాద్‌, కొచ్చువెలీ - హైదరాబాద్‌కు 8 సర్వీసులు, హైదరాబాద్‌, ఎర్నాకుళం - హైదరాబాద్‌కు ఎనిమిది సర్వీసులు తిరుగుతాయని తెలిపారు. సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా వివిధ ప్రాంతాలకు ఈ రైళ్లు నడుపుతున్నామని పేర్కొన్నారు. తేదీలు, తదితర వివరాలు సంబంధిత రైల్వే స్టేషన్‌లో తెలుసుకోవాలన్నారు. 

Updated Date - 2020-03-13T10:02:13+05:30 IST