కేంద్రం విధానాలకు నిరసనగా సమ్మె
ABN , First Publish Date - 2020-11-14T05:09:31+05:30 IST
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, వాటికి వ్యతిరేకంగా ఈ నెల 26న దేశవ్యాప్త సమ్మె చేస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.
కార్మిక సంఘాల నేతలు
నెల్లూరు (వైద్యం), నవంబరు 13 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, వాటికి వ్యతిరేకంగా ఈ నెల 26న దేశవ్యాప్త సమ్మె చేస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, ఐఎఫ్‌టీయూ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్‌కుమార్, ఇండస్ట్రియల్ కారిడార్ కమిటీ కార్యదర్శి మోహన్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు దాసోహమంటోందని విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దామా వెంకయ్య, నేతలు అంజనేయులు, రామరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి దొడ్డిదారిన ప్రజావ్యతిరేక సంస్కరణలు తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా కార్యదర్శి శ్రీరాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య, సీఐటీయూ నేతలు నాగేశ్వరరావు, పరంధామయ్య, నగేష్, కట్టా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.