-
-
Home » Andhra Pradesh » Nellore » 0 business
-
జీరో వ్యాపారం గుట్టురట్టు
ABN , First Publish Date - 2020-12-20T04:52:35+05:30 IST
నెల్లూరు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి ఎస్‌ఈబీ నెల్లూరు-1 అధికారులు, వేదాయపాలెం పోలీసులు సంయుక్తంగా అయ్యప్పగుడి పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో జీరో వ్యాపారం వెలుగులోకి వచ్చింది.

నెల్లూరు నుంచి సూళ్లూరుపేటకు ఆభరణాల రవాణా
సెబ్ అధికారులు, పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి..
రూ.60 లక్షల నగలు, 6.53 లక్షల నగదు స్వాధీనం
నెల్లూరు(క్రైం), డిసెంబరు 18 : నెల్లూరు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి ఎస్‌ఈబీ నెల్లూరు-1 అధికారులు, వేదాయపాలెం పోలీసులు సంయుక్తంగా అయ్యప్పగుడి పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో జీరో వ్యాపారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు చిన్నబజారుకు చెందిన కైలా్‌సకుమార్ గిడ్డంగివీధిలోని పలు దుకాణాల్లో బంగారు, వెండి ఆభరణాలు తీసుకొని సూళూరుపేటలోని పలు దుకాణాలకు సరఫరా చేస్తుంటాడు. వీటికి ఎలాంటి బిల్లులు ఉండవు. దీనిని జీరో వ్యాపారం అని అంటారు. శుక్రవారం రాత్రి సూళ్ళూరుపేటలోని పలు దుకాణాలకు బిల్లులు లేకుండానే నగలు సరఫరా చేసి వాటి తాలూకు రూ.6.53 లక్షల నగదును తీసుకొని చెన్నైకు చెందిన బస్సులో నెల్లూరుకు బయలుదేరాడు. తమిళనాడు బస్సుల్లో మద్యం తరలిస్తున్నారన్న అనుమానంతో సెబ్-1 ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తన సిబ్బందితో వేదాయపాలెం పోలీసులతో కలిసి వేదాయపాలెం సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంతో చెన్నై నుంచి వస్తున్న బస్సును ఆపి తనిఖీ చేయగా కైలా్‌సకుమార్ భయబ్రాంతులకు గురవుతూ అనుమానాస్పదంగా కనిపించాడు. ఈ విషయాన్ని గమనించిన ఎస్‌ఈబీ అధికారులు అతని బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో రూ. 60 లక్షలు విలువ చేసే 1025 గ్రాముల బంగారు ఆభరణాలు, 5కేజీల 520 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.6.53 లక్షల నగదు గుర్తించారు. వీటికి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో వాటిని సీజ్ చేసి వేదాయపాలెం పోలీసులకు అప్పగించారు. వేదాయపాలెం ఇన్‌స్పెక్టర్ పి రామకృష్ణ విచారించగా ఆయన ఆదేశాల మేరకు ఎస్‌ఐ లక్ష్మణ్‌కుమార్ కేసు నమోదు చేశారు. పట్టుబడిన ఆభరణాలను కమర్షియల్ టాక్స్, ఇన్‌కంటాక్స్ అధికారులకు అప్పగించామని పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో నెల్లూరు-1 ఎస్‌ఐ రవీంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.